: వడలు రుచిగా లేవని... హోటల్ యజమానిని చంపేశాడు!


కేరళలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హోటల్‌లో వ‌డలు తిన్న వ్య‌క్తి అవి రుచిగా లేవ‌న్న చిన్న కార‌ణంతో గొడ‌వ‌ప‌డి హోట‌ల్ య‌జ‌మాని గొంతుకోసి హ‌త్య‌చేశాడు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. మంగళపల్లిలోని ఓ హోటల్‌కు టిఫిన్‌ చేయడానికి వెళ్లిన రితీశ్‌ అనే ఓ యువకుడు వడ ఆర్డర్‌ ఇచ్చి, వాటిని తినేశాడు. అనంత‌రం వడ రుచి బాగోలేదని  హోటల్‌ యజమాని జాన్సన్‌తో గొడ‌వ‌పెట్టుకున్నాడు.

పరిశుభ్రంలేని ఆహారం పెడుతున్నారని, క‌స్ట‌మ‌ర్ల‌కు ఇలాంటి స‌ర్వీసేనా అందించేది? అంటూ నిల‌దీశాడు. దీంతో వారిద్దరి మధ్య వివాదం చెల‌రేగింది. ఆగ్ర‌హానికి గుర‌యిన రితీశ్ హోట‌ల్ య‌జ‌మాని గొంతుకోసి, పారిపోయాడు. కత్తి గాటు లోతుగా దిగడంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లేలోపే ఆయ‌న‌ మృతిచెందాడు. ఆ స‌మ‌యంలో నిందితుడు తాగి ఉన్నాడ‌ని స్థానికులు చెప్పారు.

  • Loading...

More Telugu News