: నాగార్జున బావ, హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు మృతి


అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు ఈ ఉదయం కన్నుమూశారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీలను సత్యభూషణ రావు వివాహం చేసుకోగా, వారికి సుశాంత్ కుమారుడు. గుండె పోటు కారణంగా సత్యభూషణరావు మరణించినట్టు సమాచారం. ఆయన మరణంతో అక్కినేని ఇంట కూడా విషాదం నెలకొంది. సత్యభూషణరావు మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు వారి ఇంటికి చేరుకుని సంతాపాన్ని తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News