: 6,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సిస్కో
ట్రంప్ నిర్ణయాలతో దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలన్నీ ఉద్యోగులకు పింక్ స్లిప్ లిస్తూ బెంబేలెత్తిస్తుండగా... గ్లోబల్ నెట్ వర్కింగ్ దిగ్గజం సిస్కో తమ సంస్థలో పని చేస్తున్న 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించి కలకలం రేపింది. రీ స్ట్రక్చరింగ్ లో భాగంగా కీ ప్రయర్ ఏరియాల్లో పెట్టుబడుల కోసం ఉద్యోగులను తొలగించనున్నామని గతంలో ప్రకటించిన ఈ సంస్థ... ఆ తరువాతి ప్రకటనలో 5,500 మంది ఉద్యోగులను తొలగించనున్నామని తెలిపింది. అయితే వారికి మరో 1100 మంది ఉద్యోగులను కలుపుకుని, మొత్తం 6,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పింది. వివిధ దశల్లో ప్రారంభం కానున్న తొలగింపు ప్రక్రియ 2018 తొలి క్వార్టర్ తో ముగుస్తుందని తెలిపింది.