: తాగునీటి ఎద్దడిపై కొన్ని జిల్లాల అధికారులు సరిగా స్పందించడం లేదు: మంత్రి లోకేష్
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై కొన్ని జిల్లాల అధికారులు సరిగా స్పందించడం లేదని, ఈ విషయం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) లో తేలిందని మంత్రి లోకేష్ అన్నారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యల విషయమై అధికారులు సీరియస్ గా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఐవీఆర్ఎస్ లో మంచి ఫలితాలు సాధించిన అనంతపురం జిల్లా అధికారులను అభినందించారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఉండకూడదని, అవసరమైతే, మరిన్ని నిధులు కేటాయిస్తామని, ఉపాధి పనుల కల్పనపై కొన్ని జిల్లాల్లో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు మజ్జిగ ఇవ్వాలని సంబంధిత అధికారులను నారా లోకేష్ ఆదేశించారు.