: ఉద్యోగులపై వేటు వేయనున్న ఐబీఎం ఇండియా?


ఐటీ రంగంలో సంక్షోభం కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే బాటలో, ఐబీఎం ఇండియా కూడా నడవనుంది. వచ్చే మూడు నెలల్లో 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, పని తీరు మెరుగ్గా లేని ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారని ఓ ఉద్యోగి చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. వ్యాపారానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే వరకూ కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలను సదరు సంస్థ ఆపి వేసినట్టు సమాచారం. కాగా, ఎంత మంది ఎంప్లాయిస్ పై వేటు పడనుందనే విషయాన్ని ఐబీఎం ఇంకా నిర్ణయించలేదు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఐబీఎం ఉద్యోగుల సంఖ్య ఒక లక్షా యాభై వేలు.

  • Loading...

More Telugu News