: ఇది మరో విప్లవాత్మక సంస్కరణ: చంద్రబాబు
జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి పత్రిపక్షం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదిస్తున్నాయని... మనం కూడా ఆమోదిద్దామని చెప్పారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు చేసిన తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని అన్నారు. ఒక దేశం ఒకే పన్ను అనే విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పారు. పన్నులపై మళ్లీ పన్నులు లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. జీఎస్టీతో కేంద్ర, రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.