: ముగిసిన బీఏసీ సమావేశం.. రైతు సమస్యలపై చర్చకు 'నో'!
జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ఏపీ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. కాసేపటి క్రితం బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి యనమల, కేఈ... వైసీపీ నుంచి పెద్దిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు హాజరయ్యారు. జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రైతు సమస్యలపై నాలుగు రోజులపాటు చర్చించాలని వైసీపీ పట్టుబట్టినప్పటికీ... అందుకు ఆమోదించలేదు.