: హిందూపురం రావడం సంతోషంగా ఉంది: నారా బ్రాహ్మణి
తన తాత ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్ సంస్థ రజతోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తోన్న సిబ్బందిని ఆమె అభినందించారు. 2022 నాటికి రూ. 6 వేల కోట్ల టర్నోవర్ తమ లక్ష్యమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు నిధిని తమ సంస్థ ఏర్పాటు చేసిందని, రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఈ నిధి నుంచి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. అనంతరం, రైతులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు, భర్తను కోల్పోయిన ఓ మహిళా రైతుకు నష్ట పరిహారం కింద రూ.2 లక్షలు అందజేశారు.