: చంద్రబాబు రూ. 5 'అన్న క్యాంటీన్'కు పోటీగా వైసీపీ రూ. 4కే రాజన్న భోజనం... నేటి నుంచి ప్రారంభం
పేదల కడుపు నింపాలన్న ఆశతో రూ. 5కే భోజనాన్ని అందిస్తూ, 'అన్న క్యాంటీన్'లను చంద్రబాబు సర్కార్ రాష్ట్రమంతటా విస్తరిస్తున్న వేళ, వైకాపా పోటీకి దిగింది. రూ. 4కే పేదలకు భోజనాన్ని అందిస్తామని చెబుతూ, 'రాజన్న మొబైల్ క్యాంటీన్' పేరిట నేడు తొలి భోజన కేంద్రాన్ని వైకాపా ప్రారంభించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ నేత ఆళ్ల నాని దీన్ని ప్రారంభించనున్నారు.
ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భోజనం రూ. 4కే లభిస్తుందని, అన్నం, కూర, పప్పు, వడియాలతో పాటు వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండును వడ్డిస్తామని ఆయన తెలిపారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 14నే శుభదినంగా ఎంచుకుని నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. గౌతమ బుద్ధ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నడపనున్నామని అన్నారు.