: భద్రత కల్పిస్తే భారత్ వెళ్లిపోతా.. ఇస్లామాబాద్ హైకోర్టును కోరిన ఢిల్లీ యువతి


పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లాడేందుకు వెళ్లి మోసపోయానని తెలుసుకున్న ఢిల్లీ యువతి శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.  తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు భద్రత కల్పించాల్సిందిగా కోరింది. ఢిల్లీకి చెందిన ఉజ్మా మలేసియాలో పాకిస్థాన్‌కు చెందిన తాహిర్ అలీని కలుసుకుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

 అందుకోసం ఈనెల 1న ఉజ్మా పాక్‌ వెళ్లింది. అక్కడికి వెళ్లాక తాహిర్‌ తనను బెదిరించి పెళ్లి చేసుకున్నాడని, అప్పటికే అతడికి పెళ్లై నలుగురు పిల్లలు కూడా ఉన్నారని, ఆ విషయం తనతో చెప్పకుండా మోసగించాడని ఉజ్మా ఆరోపిస్తోంది. తన పాస్‌పోర్ట్‌ను కూడా తాహిర్ లాక్కున్నాడని పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉన్న ఉజ్మా.. తాను తిరిగి భారత్ వెళ్లేందుకు భద్రత కల్పించాలని, డూప్లికేట్ ప్రయాణ పత్రాలను అందించేలా అధికారులను ఆదేశించాలని ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News