: తెలంగాణకు ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ.. తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు!


జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంచలనాత్మక కేసులు దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణను తెలంగాణకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగువాడైన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అక్కడే డీజీ హోదాలో ఉన్న ఆయన తిరిగి హైదరాబాద్ రావాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

శుక్రవారం తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మను లక్ష్మీనారాయణ కలిశారు. ఈ సందర్భంగా డిప్యుటేషన్‌పై ఇక్కడికి వచ్చే అంశం గురించి చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేయడంతో అప్పట్లో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

  • Loading...

More Telugu News