: వీవీఎస్ లక్ష్మణ్ కు అరుదైన గౌరవం..ఎంసీసీలో జీవితకాల గౌరవ సభ్యత్వం!


టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో 1787లో నెలకొల్పిన ప్రఖ్యాత మార్లేబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీీసీ)లో జీవితకాల గౌరవ సభ్యత్వం లభించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎంసీసీ సభ్యునిగా ఎంపిక కావడం నిజంగా ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఎంసీసీకి గొప్ప సంస్కృతి, వారసత్వం వున్నాయని, ఇందులో భాగమవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని, క్లబ్ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పాడు. కాగా, ఇంతకుముందు భారత్ తరపున ఎంసీసీలో సభ్యత్వం పొందిన వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలి, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News