: ఎంఎన్సీలు స్థానికులకు ప్రాధాన్యమివ్వాల్సిందే: సత్య నాదెళ్ల


ఎంఎన్సీలు స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని, అంతర్జాతీయంగా ఏ కంపెనీ అయినా స్థానికులకు అవకాశం కల్పించకుండా కేవలం ఆదాయంపైనే దృష్టి పెడితే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల అన్నారు. ‘మైక్రోసాఫ్ట్’ వార్షిక డెవలపర్స్ సదస్సు ‘మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2017’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంలో ఒక కంపెనీ వృద్ధిని నమోదు చేయాలంటే స్థానికులకు ఉపాధి కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.

దీని వల్ల ప్రధాన దేశాల రాజకీయనాయకులు లేవనెత్తే జాతీయత విషయాన్ని అధిగమించవచ్చని ఆయన అన్నారు. అలాగే దశాబ్దాలుగా అనుసరిస్తున్న పాత ప్రపంచీకరణ ట్రెండ్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడి ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని నాదెళ్ల ప్రస్తావించారు. అమెరికాలో ఉండే వారికి తొలి ప్రాధాన్యం అమెరికా...  బ్రిటన్ లో ఉండే వారికి బ్రిటనే మొదటి ప్రాధాన్యం అవుతాయన్నారు.

  • Loading...

More Telugu News