: మోదీని కలవడానికి జగన్ చకోర పక్షిలా ఎదురు చూశాడు: సీపీఐ నేత రామకృష్ణ
ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఏడాదిన్నర కాలంగా జగన్ చకోరపక్షిలా ఎదురుచూశాడని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని, తన కేసుల గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నిక అంశంపై తమకు ఎవరి సలహాలు అవసరం లేదని, రాష్ట్ర గుండెల్లో జగన్ మోసగాడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.