: తనకు కుమారుడు ఎలా పుట్టాడో చెప్పిన భల్లాలదేవ!
బాహుబలి సినిమా విడుదలైనప్పడు 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ప్రశ్నే బాహుబలి-2పై భారీగా అంచనాలు పెరిగేలా చేసింది. ఇప్పుడు రెండోభాగం కూడా విడుదలై భారతీయ సినీ రంగంలో సంచలనాలను నమోదు చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా మరో ప్రశ్నను ప్రేక్షకులకు మిగిల్చింది. 'భల్లాలదేవుడి భార్య ఎవరు? అతనికి కుమారుడు ఎలా పుట్టాడు?' అనేదే ఈ సందేహం.
ఈ ప్రశ్నకు భల్లాలదేవుడు రానా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. భద్ర తల్లి ఎవరు? అనే ప్రశ్న అడిగేవారికి... వాడికి తల్లే లేదని చెప్పండి అని అన్నాడు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని చమత్కరించాడు.