: జమ్మూ పోలీసుల కిరాతకం... అమాయక మహిళపై అకృత్యం!


సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జమ్మూపోలీసులు ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూపోలీసులు ఒక ఇంట్లో పని మనిషిగా పని చేసే మహిళపై తమ ప్రతాపం చూపారు. థర్డ్ డిగ్రీ కంటే దారుణమైన హింసా పద్ధతులను వినియోగించారని బాధిత వివాహిత (28) భోరున విలపించింది. తన జననాంగంలో బీరుబాటిల్ పెట్టి, మిర్చి పౌడర్ పోశారని కన్నీరు మున్నీరైంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే....జమ్మూ పట్టణంలోని దోమనా ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా పని చేస్తున్న బాధిత మహిళ ఇటీవల పని మానేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమాని ఏప్రిల్ 30న నగలు చోరీ చేసిందని ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం కెనాల్ రోడ్డులోని పోలీసుస్టేషనుకు ఆమెను తీసుకొచ్చిన జమ్మూ పోలీసులు ఆమెకు నరకం చూపించారు. తాను నేరం చేయలేదని, తాను పని మానేయడం వల్లే యజమాని తప్పుడు కేసుపెట్టాడని నెత్తీనోరు బాదుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, ఆమెకు సత్వర వైద్యం అందించాలని జమ్మూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని నియమించామని జమ్మూ జోన్ ఐజీ చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపేందుకు రూరల్ ఎస్పీని ఆదేశించామని ఐజీ తెలిపారు.

  • Loading...

More Telugu News