: శిల్పాశెట్టి భర్తను విచారించిన పోలీసులు
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను మహారాష్ట్ర పోలీసులు ప్రశ్నించారు. తమకు రావాల్సిన రూ. 24 లక్షలను ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ ఓ టెక్స్ టైల్ సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై భివాండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 420, 406 కింద పోలీసులకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను నేడు పోలీసులు ప్రశ్నించారు.