: చంద్రబాబుకు మాదిగల శాపం కచ్చితంగా తగులుతుంది: మంద కృష్ణ


మాదిగల శాపం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. టీడీపీ విజయంలో మాదిగలు కీలకపాత్ర పోషించారని... అయినప్పటికీ చంద్రబాబు మాలలను దగ్గరకు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 7వ తేదీన అమరావతిలో భారీ బహిరంగసభ నిర్వాహిస్తామని... టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, మంద కృష్ణ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News