: జూలై లో నా పెళ్లి: ఇరోమ్ షర్మిల


మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల, తన బాయ్ ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను త్వరలో పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఇరోమ్ షర్మిల మాట్లాడుతూ, జులై చివరి వారంలో వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. అయితే, తన జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, పౌరహక్కుల కార్యకర్తగా తన పోరాటం మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. కాగా, మణిపూర్ లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమలును ఆపివేయాలంటూ పదహారేళ్ల పాటు ఇరోమ్ షర్మిల దీక్ష చేసిన విషయం విదితమే. దీక్ష చేసిన సమయంలోనే బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ తో ఆమెకు పరిచయం ఏర్పడి, వారి మధ్య ప్రేమ వికసించింది. దీక్ష విరమించిన అనంతరం, మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇరోమ్ షర్మిల ఘోర పరాజయం పాలైంది.

  • Loading...

More Telugu News