: హైదరాబాదు శివార్లలో దారుణం...బ్యూటీషియన్ పై ముగ్గురు యువకుల అత్యాచారయత్నం...నిందితుల్లో ఎమ్మెల్సీ కొడుకు


హైదరాబాదు శివార్లలో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ కు చెందిన బ్యూటీషియన్ పై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారు. దీనిపై బాధితురాలు పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు ప్రీతం రెడ్డి, అరవ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. మూడో నిందితుడు ఎమ్మెల్సీ కుమారుడని తెలుస్తోంది. దీంతో అతనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నట్టు సమాచారం. కాగా అతను ఎవరు? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆమె స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. 

  • Loading...

More Telugu News