: తమిళంలో నిర్మాతగా మారిన టాలీవుడ్ దర్శకుడు సుకుమార్!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తమిళంలో నిర్మాతగా మారాడు. తెలుగులో తను తీసిన '100% లవ్' సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నాడు. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమాను తమిళంలో జీవీ ప్రకాశ్ ను హీరోగా పెట్టి తీయనున్నాడు. తమిళ వెర్షన్ కు చంద్రమౌళి దర్శకత్వం వహించనున్నాడని తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన జీవీ ప్రకాశ్ తమిళ 100% లవ్ దర్శకుడు చంద్రమౌళి, నిర్మాత సుకుమార్, సినిమాటోగ్రఫర్ డూడ్లీతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఇది తమిళ, తెలుగు సినీ పరిశ్రమలను ఆకట్టుకుంటోంది. కాగా, ప్రాధాన్యమున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న విషయం వెల్లడించకపోవడం విశేషం.