: కంటి శస్త్ర చికిత్స కోసం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్!
తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, రాధామోహన్ సింగ్ ను కేసీఆర్ కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.