: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కె.విశ్వనాథ్ కు ఘన స్వాగతం


దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తరపున దర్శకుడు విశ్వనాథ్ కు త్వరలో సన్మానం చేస్తామని తెలిపారు. కాగా, నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును విశ్వనాథ్ అందుకున్నారు. 

  • Loading...

More Telugu News