: హర్బజన్ కూతురు నా గడ్డంలో ఏదో వెతుకుతోంది చూడండి...వైరల్ అయిన కోహ్లీ పోస్టు


  ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరపరాజయాల నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఉపశమనం పొందుతున్నాడో తెలుసా?... పూణేతో జరిగిన మ్యాచ్ అనంతరం మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె జివాతో ఆడుకుని, ముంబైతో మ్యాచ్ అనంతరం హర్భజన్ సింగ్ కుమార్తె హినయతో ఆడుకుని ఉపశమనం పొందాడు.

గతంలో జివాతో ఆడుకున్న ఫోటోను ట్వీట్ చేసిననట్టే, హర్భజన్ కుమార్తె హినయతో ఆడుకున్న ఫోటోను కూడా కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా... 'బేబీ హినయ నా గడ్డంలో ఏదో వెతుకుతోంది' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది. కోహ్లీ, హర్భజన్, గీతా బాస్రా అభిమానులు ఈ ఫోటోను ట్వీట్లు, కామెంట్లు, రీ ట్వీట్లతో హోరెత్తించారు. 

  • Loading...

More Telugu News