: ఒంటి చేత్తో జట్టుకు విజయం అందించిన ఐపీఎల్ సీజన్-10 కాస్ట్లీ ఆటగాడు
14.5 కోట్ల రూపాయలకు అమ్ముడై ఐపీఎల్ 10లో రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్-10లో ఒంటిచేత్తో జట్టుకు విజయం అందించాడు. రెయిజంగ్ పూణే సూపర్ జెయింట్ జట్టు తరపున ఆడుతున్న బెన్ స్టోక్స్... గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. 63 బంతులు ఆడిన బెన్ స్టోక్స్...7 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే కాకుండా ఐపీఎల్ లో బెన్ స్టోక్స్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పూణే జట్టుకు 162 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన గుజరాత్ లయన్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆకట్టుకున్నారు. సహచర టాప్ ఆర్డర్ ఆటగాళ్లంతా వెనుదిరుగుతున్నా..స్టోక్స్ కంగారు పడకుండా వీలు కుదిరినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.