: ఆసక్తికరం... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టించిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'


ఒడిశా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ ఏటీఎం దొంగను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా పోలీసులకు పట్టించిన ఆసక్తికర ఘటన భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఏటీఎం దొంగ సంభవ్‌ ఆచార్య కోసం ఆ రాష్ట్ర పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. పోలీసు వాసన తగిలితే చాలు, చాకచక్యంగా తప్పించుకుని సవాలు విసురుతున్నాడు సంభవ్ ఆచార్య.

ఈ నేపథ్యంలో అతనిని ఎలాగైనా అరెస్టు చేయాలని భావించిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో ‘బాహుబలి 2: ది కన్‌ క్లూజన్‌’ సినిమాను వీక్షించేందుకు భువనేశ్వర్ లోని ఓ థియేటర్‌ కు సంభవ్ ఆచార్య వచ్చాడు. అక్కడ ఆచార్యను గుర్తించిన స్పెషల్ స్క్వాడ్ పోలీసులు, వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనిపై సుమారు 50 ఏటీఎంలను దోచేసిన కేసులున్నాయి. 

  • Loading...

More Telugu News