: ఓ మహిళా గ్యాంగ్ స్టర్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది: బీజేపీ ఎంపీ పటేల్


ఓ మహిళా గ్యాంగ్ స్టర్ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని గుజరాత్ కు చెందిన బీజేపీ ఎంపీ (వల్సాడ్ లోక్ సభ నియోజకవర్గం) కేసీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూల్ డ్రింక్ లో మత్తుపదార్థాలు కలిపి తాను స్పృహలో లేనప్పుడు తనను అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆయన ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఆ మహిళా గ్యాంగ్ స్టర్ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని పోలీసులకు తెలిపారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కూడా సదరు ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసీ పటేల్ తనపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News