: మన జవాన్లను ముక్కలుగా నరికిన పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంటాం: భారత ఆర్మీ ప్రకటన


స‌రిహ‌ద్దు ప్రాంతంలో కాల్పుల‌కు పాల్ప‌డుతూ భార‌త్‌ను రెచ్చ‌గొడుతున్న పాకిస్థాన్ ఈ రోజు జమ్ముకశ్మీర్ పూంఛ్‌ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద  గ్రనైడ్లు నింపిన రాకెట్‌ను ప్రయోగించి, ఇద్దరు భార‌త‌ జవాన్ల ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఘ‌ట‌న‌పై ఆర్మీ అధికారులు మ‌రిన్ని వివ‌రాలు తెలిపారు. ఈ దాడిలో అమ‌రులైన‌ ఇద్దరు భార‌త జవాన్ల మృతదేహాలను పాక్‌ ఆర్మీ అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసిందని చెప్పారు. ఈ దుశ్చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపిన‌ ఆర్మీ దీనిపై పాక్‌ తగిన సమాధానం చెప్పాలని పేర్కొంది. ఈ ఘటనకు తాము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఓ ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ఈ రోజు జ‌రిగిన దాడిలో జేసీవో నయీబ్‌ సుబేదార్‌ పరంజీత్‌ సింగ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్ ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది.

  • Loading...

More Telugu News