: ఏ క్షణంలోనైనా మరో అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తాం: అమెరికాను రెచ్చగొట్టిన ఉత్తర కొరియా!
ఉత్తర కొరియా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎన్నో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించి అలజడి రేపిన ఆ దేశం తాజాగా మరో అణు పరీక్షకు సిద్ధమని ప్రకటించింది. తాము ఏ క్షణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ పరీక్ష నిర్వహిస్తామని కలకలం రేపింది. తమ దేశం నుంచి సుదూర ప్రాంతాలను ఢీ కొట్టగలిగే సామర్థ్యమున్న క్షిపణిని ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా స్పష్టం చేసింది.
అయితే, ఈ దఫా అణ్వాయుధ పరీక్షలు చేపట్టకూడదని, ఒకవేళ ఆ చర్యకు పాల్పడితే సైనిక దాడులకు దిగాల్సి ఉంటుందని ఉత్తరకొరియాను అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అమెరికాకు సవాలు చేస్తూనే ఉత్తరకొరియా ఇటువంటి ప్రకటన చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో అమెరికాను దీటుగా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధమని ఉత్తరకొరియా అంటోంది.