: ఐపీఎల్ మ్యాచ్ చూసి ఇంటికెళుతుండగా ఘోర ప్రమాదం... ఓ ఎంపీటీసీ సహా ముగ్గురు యువకుల మృతి


నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ని చూసేందుకు వచ్చిన ప్రకాశం జిల్లా యువకులు నలుగురు, తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదం బారిన పడగా, వారిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నలుగురు స్నేహితులు కారులో (ఏపీ 27 డీఎఫ్ 4653) మ్యాచ్ చూసేందుకు వచ్చారు. మ్యాచ్ అనంతరం వెనక్కు వెళుతున్న సమయంలో, కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపివున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శింగరకొండపాలెం ఎంపీటీసీ శ్రీకాంత్, గుంటూరు జిల్లా వాసి వెంకటసాయి, తెనాలికి చెందిన పూర్ణచందర్ రావులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన యువకుడిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News