: మద్యానికి బానిసలైన భర్తలకు కష్టమే.. నవ వధువులకు కానుకగా బ్యాట్లు!


మధ్యప్రదేశ్ లో జరిగిన సామూహిక వివాహాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని గార్హకోట టౌన్ లో సుమారు 700 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ హాజరయ్యారు.ఈ సందర్భంగా నవ వధువులకు ఆయన ‘మోగ్రీ’ అని పిలిచే చెక్క బ్యాట్లను వారికి కానుకలుగా అందజేశారు.

కాగా, మధ్యప్రదేశ్ లో ఈ బ్యాట్లను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. అయితే, గార్హకోటలో చాలా మంది మగాళ్లు మద్యానికి బానిసలు అవుతున్నారు. అటు బట్టలు ఉతికేందుకు, అవసరమైతే మద్యానికి బానిసలైన భర్తలను అదుపులో పెట్టేందుకు ఈ బ్యాట్లు ఉపయోగించాలనే పరమార్థం ఆ కానుకల వెనుక ఉందని పలువురు భావిస్తున్నారు.  

  • Loading...

More Telugu News