: ఈడెన్ లో వరుస విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ రికార్డు
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రికార్డు నెలకొల్పింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో వరుసగా 12 విజయాలు సాధించి, రికార్డు నెలకొల్పింది. నిన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో టాప్ జట్టుగా నిలిచింది. దీంతో తొలుత ప్లేఆఫ్ కు చేరిన జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది.