: ట్రంప్ పాలనకు రేపటితో వంద రోజులు.. మీడియాతో డొనాల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు!


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపటితో తన వంద రోజుల పాలన   పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలను ట్రంప్ మీడియాతో పంచుకున్నారు. ‘అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు ఒక వృద్ధుడిగా నా జీవితం చాలా బాగుంది. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అయితే, అధ్యక్షుడిని అయ్యాక, డ్రైవింగ్ చేయడాన్ని చాలా మిస్సవుతున్నాను .. నడపలేకపోతున్నాను. అధ్యక్షుడిని కాకముందు.. అన్ని పనులు నేనే చేసే వాడిని. అయితే, అధ్యక్షుడిగా అంతకంటే ఎక్కువ పనులే ఉంటున్నాయి. ఆ జీవితం కంటే, అధ్యక్షుడిగా ఉండటమే సులువుగా అనిపిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎక్కడికీ పోలేము .. దీంతో, ఓ భద్రమైన గూటిలో ఉన్నట్టుంది’ అని ట్రంప్ అన్నారు. కాగా, దేశాధ్యక్షుడిగా తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న రోజున పెన్సిల్వేనియాలో పెద్ద ర్యాలీ చేపడతానని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News