: జగన్ న్యూజిలాండ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు
వైసీపీ అధినేత జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ ను కొట్టివేయడమే కాక... అతని న్యూజిలాండ్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే న్యూజిలాండ్ కు సింగిల్ గా వెళ్లకూడదని, కుటుంబసభ్యులతో కలసి వెళ్లాలని కోర్టు షరతు విధించింది. మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ మధ్యలో న్యూజిలాండ్ కు వెళ్లవచ్చని సూచించింది. 15 రోజుల పాటు న్యూజిలాండ్ వెళ్లవచ్చని తెలిపింది.