: జగన్ కు ఊరట.... బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసిన న్యాయస్థానం!


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. దీంతో సీబీఐ వాదనను తోసిపుచ్చి, బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి, జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని తెలిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టేసినట్టు ప్రకటించింది. కాగా, జగన్ బెయిల్ రద్దువుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిన నేపథ్యంలో...న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెలువరించడం జగన్ తో పాటు వైఎస్సార్సీపీకి గొప్ప ఊరట లభించినట్టైంది. 

  • Loading...

More Telugu News