: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు అనారోగ్యం పాలైనపుడు చికిత్స నిమిత్తం అవసరమైన నగదు కోసం ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వీయ ప్రకటన సరిపోతుందని పీఎఫ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 25న కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ వో కమిషనర్ వి.పి.జాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖాతాదారులకు మేలు జరగనుందని, ఇకపై తమ ఖాతా నుంచి నగదును పొందేందుకు వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, గతంలో అయితే, వైద్య ఖర్చుల కోసం ఖాతాదారులు పని చేస్తున్న సంస్థల నుంచి ఆమోదం పొందినట్టు లేఖ లేదా మెడికల్ సర్టిఫికెట్ జత చేయాల్సి వచ్చేది.