: ఎక్కడికి వెళ్లినా చాలామంది నన్ను ఓ ప్రశ్న అడుగుతున్నారు: సీఎం చంద్రబాబు
తాను ఎక్కడికి వెళ్లినా, చాలామంది తనను ఓ ప్రశ్న అడుగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..‘ఇండియాలో మళ్లీ ఎలక్షన్స్ వస్తే.. మీరు ఓడిపోతే మా బతుకు ఏంటి? కష్టాలు వస్తాయి అని అడుగుతున్నారు. కామన్ క్వశ్చన్.. రిపీటెడ్ గా అడుగుతున్నారు. నేను అన్నాను.. ఓడిపోయే సమస్య ఉండదు లేవయ్యా.. మీకేం భయం లేదు.. ఇరవై ఏళ్లు ఉంటాము. ఇంతకు ముందు కూడా నన్ను ఎవ్వరూ ఓడించలేదు. నేను.. తొందరపడి.. ఏదో చేసెయ్యాలని పరిగెత్తి పరిగెత్తి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈ సారి అలా కాకుండా.. సుస్థిరమైన పాలన కోసం, ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతున్నాము. పేద వాళ్ల కోసం ఒక పక్క వెల్ఫేర్, డెవలప్ మెంట్, గవర్నెన్స్..’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.