: కళాతపస్వి విశ్వనాథ్ ను కలిసిన అల్లు అర్జున్.. హ్యాపీగా ఉందని ట్వీట్!


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌కు 2016 సంవ‌త్స‌రానికి గానూ కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మెగా కుటుంబం నుంచి చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ వేర్వేరుగా ఆయన‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెల‌ప‌గా, ఈ రోజు ఆ ఫేమిలీకి చెందిన బన్నీ కూడా విశ్వ‌నాథ్‌ను క‌లిశాడు. తాను ఈ రోజు విశ్వ‌నాథ్‌ను క‌లిశాన‌ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అభిమానుల‌కు తెలిపి, ఈ సంద‌ర్భంగా విశ్వ‌నాథ్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయ‌న‌ను ఆత్మీయంగా పలుకరించి, కొద్దిసేపు ఆయ‌న‌తో మాట్లాడాడు. విశ్వనాథ్‌ను క‌లిసినందుకు బ‌న్నీ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.  



  • Loading...

More Telugu News