: ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్
రంజీ మాజీ క్రికెటర్ అమోల్ జిచ్ కర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగపూర్ లోని అతని నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం నాడు ఈ ఘటన జరగ్గా మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది. ఆర్థిక సమస్యల కారణంగానే అమోల్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలే మాజీ క్రికెటర్ విపుల్ పాండేతో కలసి అమోల్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారం కూడా నష్టాలనే మిగల్చడంతో... మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాగపూర్ లో భార్య, కుమారుడితో కలసి ఆయన నివసిస్తున్నాడు. రంజీల్లో విదర్భ జట్టుకు అమోల్ ప్రాతినిధ్యం వహించాడు.