: వర్షం కారణంగా సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ కు అంతరాయం
వర్షం కారణంగా ఐపీఎల్ సీజన్ 10 లో సన్ రైజర్స్ హైదరాబాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ప్రారంభ సమయానికి వర్షం కురిసింది. దీంతో పిచ్ పై సిబ్బంది కవర్లు కప్పారు. అనంతరం తెరిపినిచ్చిన వర్షం...టాస్ కు దిగేందుకు సిద్ధం కాగానే మళ్లీ కురవడం ప్రారంభించింది. దీంతో మళ్లీ టాస్ వాయిదా పడింది. పిచ్ పై కవర్లు మళ్లీ వచ్చిచేరాయి. దీంతో మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని రెండు జట్లు భావిస్తున్నాయి.