: బ్రిటన్‌లో 38 మంది ఎన్నారైల అరెస్ట్... వీసా గడువు ముగిసినా ఉంటున్నారని ఆరోపణలు!
వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై బ్రిటన్‌లో 38 మంది ఎన్నారైలు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో ఉంటున్నారని, మరో ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. ఓ వస్త్ర కర్మాగారంలో నిర్వహించిన సోదాల్లో వీరు పట్టుబడినట్టు తెలిపారు.