: కుప్పకూలిన యూఏవీ ‘లక్ష్య’!
ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన మానవ రహిత విమానం (యూఏవీ) ఒకటి ఒడిశాలో కుప్పకూలింది. బాలాసోర్ జిల్లా చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో యూఏవీ ‘లక్ష్య’ను పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘లక్ష్య’ను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసిన కొద్దిసేపటికే చందామణి ప్రాంతంలోని పంట పొలాల్లో కుప్పకూలింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు.