: 125 మంది ఉద్యోగులకు హోండా యాక్టివా 4జీ టూవీలర్లను బహుమతిగా ఇచ్చిన యజమాని


గుజరాత్‌ కు చెందిన వజ్రాల వ్యాపారి లక్ష్మీదాస్ వెకారియా తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు మంచి బహుమతులు అందజేశారు. నోట్ల రద్దు, ఆర్థిక ఆంక్షలు వంటి నిర్ణయాల నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక మందగమనంలో కూడా మంచి ఫలితాలు సాధించారని అభినందిస్తూ తన సంస్థలో పని చేసే 125 మంది ఉద్యోగులకు హోండా యాక్టివా 4జీ స్కూటర్లను కానుకగా ఇచ్చారు. అంతే కాకుండా సంస్థలోని ఇతర ఉద్యోగులకు కూడా రివార్డులు అందజేశారు.

ఆయన కంపెనీలో 5,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికీ బహుమతులు ఇచ్చేందుకు ఆయన 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇచ్చిన రెండో గుజరాత్ వ్యాపారవేత్తగా లక్ష్మీదాస్ వెకారియా నిలిచారు. గతేడాది దీపావళికి వజ్రాల ఎగుమతి వ్యాపారి సావ్జీభాయ్ ఢోలకియా తన కంపెనీ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News