: భారతీయులందరూ వీఐపీలే.. ప్రధాని మోదీ


ప్రతీ భారతీయుడు ప్రత్యేకమైనవాడేనని, భారతీయులందరూ వీఐపీలేనని ప్రధాన నరేంద్రమోదీ అన్నారు. మే 1 నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, అధికారుల కార్లపై ఎర్రబుగ్గ వినియోగించరాదంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుగ్గకార్ల నిషేధం నిర్ణయం చారిత్రకమైనదిగా పేర్కొంటూ ప్రధానికి ఓ ట్వీట్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని, భారతీయులందరూ ప్రత్యేకమైనవారేనని ఆ ట్వీట్‌కు సమాధానంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడు వీఐపీయేనని అందులో పేర్కొన్నారు. కాగా, బుగ్గకార్లను నిషేధిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News