: మోహన్ లాల్ ‘భీముడు’ కాదు ‘చోటా భీమ్’: బాలీవుడ్ నటుడు కేఆర్ కే విమర్శలు
దక్షిణాది సినీ నటులపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ (కేఆర్ కే) మరోమారు వార్తల్లో నిలిచాడు. ఈసారి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘ది మహాభారత్’ చిత్రంలో భీముడి పాత్రను మోహన్ లాల్ పోషించనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమాల్ ఓ ట్వీట్ చేశాడు. ‘మోహన్ లాల్ సార్, ‘చోటా భీమ్’ లా కనిపిస్తున్న మీరు, ‘మహాభారతం’లో భీముడి పాత్రను ఎలా పోషిస్తారు? బీఆర్ షెట్టి డబ్బులను మీరు ఎందుకు వేస్ట్ చేయాలని అనుకుంటున్నారు?’ అని ఆ ట్వీట్ లో విమర్శించాడు. అయితే, ఈ విమర్శపై మోహన్ లాల్ అభిమానులు మండిపడుతున్నారు. ‘ది మహాభారత్’ టీమ్ స్పందిస్తూ.. మోహన్ లాల్ లేకుంటే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లేది కాదని, భీముడి పాత్రకు మోహన్ లాల్ తప్పా, మరెవ్వరూ సరిపోరని దర్శకుడు శ్రీకుమార్ కితాబిచ్చారు.