: ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన అఖిలప్రియ
విజయవాడ సమీపంలో కృష్ణానది మధ్య పర్యాటక ప్రాంతంగా ఉన్న భవానీ ఐలాండ్ లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఈ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె రాక గురించిన సమాచారం ముందుగా తెలియకపోవడంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. బరం పార్క్ నుంచి ప్రత్యేక బోటులో భవానీ ఐలాండ్ కు చేరుకున్న ఆమె, పర్యాటకులకు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆపై అధికారులతో మరింత మందిని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై సమీక్ష జరిపారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు.