: శ్రీశాంత్‌కు చుక్కెదురు.. నిషేధం ఎత్తివేతకు నో చెప్పిన బీసీసీఐ


కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు మరోమారు చుక్కెదురైంది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు బీసీసీఐ నిరాకరించింది. నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన ఏదీ లేదంటూ తేల్చి చెప్పింది. బోర్డు పరిపాలక కమిటీ (సీవోఏ)కి శ్రీశాంత్ రాసిన లేఖకు సీఈవో రాహుల్ సమాధానమిస్తూ క్రికెట్‌లో అవినీతిని ఉపేక్షించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. 2013లో ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం కొనసాగుతుందని, క్రికెట్‌లోకి అతడిని అనుమతించేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. కేరళలోని స్థానిక కోర్టులో అతడు చేసిన అప్పీలుకు తమ లీగల్ కౌన్సిల్ సమాధానం చెబుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News