: దేవినేని నెహ్రూ ఎన్నో విషయాలు నాతో పంచుకునేవాడు: కంభంపాటి

ఎన్టీ రామారావు ఆశీస్సులతో నాడు యువకులుగా ఉన్న దేవినేని నెహ్రూ, కంభంపాటి రామ్మోహన్ రావు, కోడెల శివప్రసాద్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూతో తనకు ఉన్న అనుబంధాన్ని కంభంపాటి గుర్తు చేసుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ రోజు చాలా దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. నెహ్రూ ఓ యువకుడుగా నాడు విద్యార్థి సంఘాలు పెట్టారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీలోకి వచ్చారు... ఎన్నో అవాంతరాలను అధిగమించి ఒక నాయకుడిగా దేవినేని నెహ్రూ ఎదగడమనేది అందరికీ తెలిసిందే. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఆయన పని చేశారు. నెహ్రూ ఓ మంచి కుటుంబం నుంచి వచ్చారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా దేవినేని మెలిగారు. కీలకపాత్ర పోషించారు. ఇటీవల మళ్లీ టీడీపీలో కి నెహ్రూ వచ్చినప్పుడు సొంతగూటికి చేరానని చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

కొన్ని రోజుల క్రితం, నెహ్రూను నేను కలిశాను. పార్టీ, పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ప్రస్తావించాను. సుదీర్ఘంగా చర్చించాను. నెహ్రూ కుటుంబంతో కలిసి భోజనం కూడా చేసి వచ్చాను... నవ్వుతూ ప్రతిఒక్కరినీ పలకరించే వ్యక్తి నెహ్రూ. ఈ వారసత్వాన్ని దేవినేని కుమారుడు అవినాష్ ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజలు కూడా అదే ఆదరణ ఇస్తారని, అవినాష్ తన తండ్రి కన్నా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.. నెహ్రూ ఎన్నో విషయాలు నాతో పంచుకునేవాడు. నెహ్రూ ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తి. కనీసం, మంచినీళ్లు కూడా బయట తాగడు. దురలవాట్లు లేవు. సాయంత్రానికి ఇంటికి చేరి, ఏడున్నర కల్లా భోజనం చేసి పడుకునే వ్యక్తి. క్రమశిక్ష్ణణకు మారుపేరు..’ అని కంభంపాటి చెప్పుకొచ్చారు.

More Telugu News