: అల్లు అర్జున్ దేవుడు లాంటివాడు: రఘు మాస్టర్
తనకు హీరో అల్లు అర్జున్ దేవుడితో సమానమని స్టార్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అన్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... అల్లు అర్జునే తనకు కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం ఇచ్చాడని అన్నాడు. తాను ‘ఆర్య-2’ సినిమాకు తొలిసారిగా బన్నీతో స్టెప్పులేయించానని చెప్పాడు. అప్పటి వరకు తమిళ కొరియోగ్రాఫర్లే తెలుగు సినిమాలకు కూడా డ్యాన్స్ మూమెంట్లు కంపోజ్ చేసేవారని, బన్నీ తన సినిమాతో తనలాంటి కొత్తవారికి అవకాశం కల్పించాడని ఆయన అన్నాడు. మనం ఏ స్థాయిలో ఉన్నా, మనకు తొలి అవకాశం కల్పించిన వారు దేవుడితో సమానమని అన్నారు.