: మేం రెడీ...మీకు చేతనైతే ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించండి: ఎన్నికల సంఘం బహిరంగ సవాల్
విపక్షాలన్నీ మూకుమ్మడిగా ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై విమర్శలు చేస్తుండడంతో జాతీయ ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చేతనైతే ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలంటూ రాజకీయ పార్టీలు, హ్యాకర్లు, శాస్త్రవేత్తలకు జాతీయ ఎన్నికల సంఘం (ఈసీ) బహిరంగ సవాల్ విసిరింది. ఇందుకు తాము మే మొదటి వారంలో సిద్ధంగా ఉంటామని తెలిపింది. కాగా, తనకు 72 గంటల సమయం ఇస్తే ఈవీఎంలు దోషపూరితమని నిరూపిస్తానని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేయగా, అప్పుడు కూడా ఈసీ ఇలాంటి సవాలే విసిరింది.